Sirpur | ఉపాధి పథకాన్నియధావిదంగా కొనసాగించాలి…

Sirpur | ఉపాధి పథకాన్నియధావిదంగా కొనసాగించాలి…

  • కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుడ్మెత యశ్వంతరావు
  • సిర్పూర్ (యు) లో నిరసన కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన

Sirpur | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విబిజిరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత మహాత్మా గాంధీ జాతీయో ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు ) మండల కేంద్రంలోకాంగ్రెస్ నాయకుల నిరసన చేపట్టారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం గోవిందరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుడ్మెత యశ్వంతరావు మాట్లాడుతూ… మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని యధావిదంగాకొనసాగించాలన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరైనది కాదన్నారు. విబిజి రామ్ జీ కొత్త చట్టంవల్లఉపాధిహామీకూలీలు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజావ్యతిరేక చట్టాలను తేవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గతంలో పేద ప్రజలకు వంద రోజులు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఉపాధి హామీ ప్రవేశంపెట్టారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చి కొత్త పథకం విబిజిరామ్ జీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఆత్రం దౌలత్ రావు, సీనియర్ నాయకులు సుద్దాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పేందోర్ రామారావు, మైనార్టీ నాయకులు షేక్ ఆరిఫ్,ఆత్రం నాగోరావు, సర్పంచ్ లు మెస్రం భూపతి, టెక్మ అంబా రావు, డైరెక్టర్ లచ్చు, ఆత్మ డైరెక్టర్ మహేశ్, వార్డు సభ్యులు దేవిదాష్, పవర్ విఠల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply