Sirpur | మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ పై శిక్షణ

Sirpur | మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ పై శిక్షణ

Sirpur | సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏడవ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ పై ఇవాళ జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన డిప్యూటీ స్టార్టి స్టికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆఫీసర్లకు ఈజీఎస్ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో ఎస్ఓ వెంకటేశ్వర్ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ పై సెన్సెస్ నిర్వాహ‌ణ విధానం, డేటా సేకరణ, నివేదికల తయారి పై అవగాహన కల్పించారు. ఎంపీడీవో కృష్ణారావు మాట్లాడుతూ… మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ ను సద్వినియోగం చేసుకొని పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మూడు మండలాల అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply