Breaking | ఉద్యోగాల పేరిట రూ.50లక్షలు వసూళ్లు.. ఏసీబీకి చిక్కిన‌ సింగరేణి డ్రైవర్

కొత్తగూడెం : సింగరేణి మెయిన్ వర్క్‌షాప్‌ డ్రైవర్ అన్నబోయిన రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్ అన్‌ఫిట్‌ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని చెప్పి సుమారు రూ.50లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.


ఈ క్రమంలో రాజేశ్వరరావుతో పాటు మరికొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి, పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వంలో అధికారులు రాజేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా కొన్ని ప్రముఖ పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. సింగరేణిలో కొనసాగుతున్న ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *