siege | అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపుసీజ్…

siege | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపు ఈ రోజు సీజ్ చేసినట్లు తాసిల్దార్ చింత రవి తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రామంలో సుమారు 6 ట్రాక్టర్ల ఇసుక డంపు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా ఎలాంటి అనుమతి లేకపోవడంతో ఇసుక డంపు సీజ్ చేసినట్లు విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసే ప్రజలు స్వచ్ఛందంగా రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులకు సమాచారంఇవ్వాలనికోరారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు.
