SI | ప్రతి ఒక్కరూ ట్రాపిక్ నిబంధనలు పాటించాలి

SI | ప్రతి ఒక్కరూ ట్రాపిక్ నిబంధనలు పాటించాలి

  • కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి

SI | కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. హెల్మెట్ ధారణ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాద సమయంలో ప్రాణ రక్షణకు కవచంలా పని చేస్తుందని తెలిపారు. అజాగ్రత్త వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు.

యువత రాష్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. అనంతరం ఏ ఎంసి చైర్మన్ పాలేపూ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో భద్రతా ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్, ఉప సర్పంచ్ శశశిధర్, అశోక్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply