ఉట్నూర్, జూన్ 23 (ఆంధ్రప్రభ) : దేశం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee) చేసిన త్యాగం మరువలేనిదని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ (MP Godam Nagesh), బీజేపీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ రితేష్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పులాజి బాబా కళాశాలలో జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా పార్లమెంటు సభ్యులు గొడం నగేష్, రితేష్ రాథోడ్ (Ritesh Rathod) మాట్లాడుతూ… ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ ఛాలెంగే అనే నినాదంతో జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు శ్రీరామ్ నాయక్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి కాల్వ రవి, సల్గర్ రవీందర్, మాజీ ఎంపీపీ ఆడే ధన్ లాల్, మాజీ జెడ్పిటిసి సాడిగా గంగన్న, బీజేపీ రాష్ట్ర నాయకులు బానోత్ జగన్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ దావుల బాలాజీ, జిల్లా నాయకులు లింగ గౌడ్, సడిగె రాజేశ్వర్ రాథోడ్, శేషారావు, కొమ్ము రామచందర్, నాగభూషణ్, పొన్నం జగన్, తదితరులు పాల్గొన్నారు.