చ‌ట్ట స‌భ‌ల్లో స‌ముచిత స్థానాన్ని క‌ల్పించాలి..

చ‌ట్ట స‌భ‌ల్లో స‌ముచిత స్థానాన్ని క‌ల్పించాలి..

లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : బీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు బీసీల హక్కులను కాలరాసే విధంగా హైకోర్టులో పిటిషన్(Petition) వేసి స్టే వచ్చేలా చేశారని రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాల నాయకుల పిలుపుతో ఈ రోజు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. అంబేద్కర్ చౌరస్తా(Ambedkar Square) వద్ద ఐక్య బీసీ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 % చట్టసభల్లో సముచిత స్థానాన్ని కల్పించాలన్నారు. పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం(Constitution) ప్రసాదించిన హక్కులు బీసీలకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగంలో మెజారిటీ ప్రజలకు న్యాయం చేయాలని రిజర్వేషన్స్ కల్పిస్తే కొందరు అడ్డు పడటం అన్యాయమని వివరించారు. కాగా, పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సీఐ రమణ మూర్తి(CI Ramana Murthy), ఎస్సై సురేష్ లు బందోబస్త్(Bandobast) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆరీఫ్, అశోక్, బియ్యాల తిరుపతి, బీజేపీ నాయకులు ముత్తే సత్తయ్య, బీ ఆర్ ఎస్ నాయకులు పాదం శ్రీనివాస్, అంకతి రమేష్, బీసీ ప్రజాసంఘాల కన్వీనర్ కళ్యాణం రవి, కుల సంఘాల నాయకులు అంకతి కిషన్, మాజీ రైతు సమితి అధ్యక్షుడు చుంచు తిరుపతి, అంబేద్కర్ సంఘం నాయకులు చిప్పకుర్తి నారాయణ, తొగరి రాజు, మాలం చిన్నయ్య, పెద్ద మొత్తంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తల పాల్గొన్నారు.

Leave a Reply