WGL | యూరియా కొరత.. రైతుల కలత
నర్సింహులపేట, ఫిబ్రవరి19 (ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.. సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాల్లో యూరియా అందుబాటులో లేక అష్ట కష్టాలు పడుతున్నారు.
బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార కేంద్రానికి 444 సంచుల యూరియా వచ్చింది. రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఒక్కొక్కరికి ఐదేసి సంచులు ఇచ్చారు. గంటల్లోనే యూరియా అయిపోవడంతో చాలామంది రైతులు నిరాశ చెందుతున్నారు. రబీ సీజన్ లో వరి, మొక్కజొన్న అధికంగా సాగు చేయడంతో ప్రస్తుతం వీటికి యూరియా వేయాల్సి ఉండడంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు యూరియా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.