FIRE ACCIDENT | షాపు దగ్ధం…

FIRE ACCIDENT |షాపు దగ్ధం…
FIRE ACCIDENT | నర్సంపేట,క్రైమ్, ఆంధ్రప్రభ : పట్టణంలో శనివారం అర్థ రాత్రి షార్ట్ సర్క్యూట్ సంభవించి ఓ కంగన్ హాల్ దగ్ధమైంది. బాధితుడు ముదురు కోళ్ల రాజేందర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నర్సంపేట పట్టణానికి చెందిన నిరుపేద ముదురుకోళ్ల రాజేందరు తన స్నేహితులు ఆర్థికసాయం చేసి జీవనోపాధి కోసం పోలీస్ స్టేషన్ (Police Station) సమీపంలో గత సంవత్సరం కిందట సుధా కంగన్ హాల్ పెట్టించారు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి కంగన్ హాల్ను పది గంటల ప్రాంతంలో మూసివేసి ఇంటికి వెళ్లాడు.

రాత్రి 11 గంటలకు సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి కంగన్ హాల్ (Kangan Hall) పూర్తిగా దగ్ధమైంది. ఈ సమాచారాన్ని పక్కషాపు వారు అందించారు. ఈ ఘటనలో లక్షల్లో విలువైన దుస్తులు,గాజులు దగ్ధమయ్యాయి. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనతో రాజేందర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
