ఫిలడెల్ఫియా : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఫెయిర్‌మౌంట్ పార్క్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
లెమన్ హిల్ డ్రైవ్‌లో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పార్కులో సేదతీరుతున్నారు. ఆ సమయంలో అక్కడ కాల్పులు జరిగినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. మృతులు ఇద్దరూ మైనర్లే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.