బిఆర్ఎస్ కు షాక్

బిఆర్ఎస్ కు షాక్
- కాంగ్రెస్ లోకి మాజీ కౌన్సిలర్
- పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల కు ముందు బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ పెద్ది గీతాంజలి వెంకటేష్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీ పై ఎగిరేది కాంగ్రెస్ జెండాని, మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోబోతున్నామన్నారు. ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపైకి బచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంటా రమేష్, మాడూరి వినోద్, ఇల్లందుల రజనికృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘం నాయకులు మంచాల వరప్రసాద్, నార్ల నాగభూషణం, కొమురవెల్లి జయప్రకాష్, వెలిశాల రాజు, గిరి, సతీష్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.
