శర్బనాపురం ఉమాశంకర ఆలయంలో శివరాత్రి పూజలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షర్మినాపురం గ్రామంలోని శ్రీ ఉమా శంకర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం విశేషాభిషేక పూజలు జరిగాయి. బ్రహ్మశ్రీ పీసపాటి లక్ష్మీ గణపతి శాస్త్రి నిర్వహణలో స్వామి వారికి అభిషేక పూజలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ చైర్మన్ చామల రవీందర్ రెడ్డి, సర్పంచ్ మొగులగానే నరసింహులు, ఎవరెస్ట్ హై స్కూల్ కరస్పాండెంట్ మిట్టపల్లి విజయ్ కుమార్, అర్చకులు అనంత్, భక్తులు, గ్రామస్తులుపాల్గొన్నారు.
