shivaratri l మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్తున్న భక్తులకు కీలక సూచనలు…

shivaratri l మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్తున్న భక్తులకు కీలక సూచనలు…
shivaratri l నంద్యాల, ఆంధ్రప్రభః దేశ వ్యాప్తంగా పులుల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. నల్లమల్ల అడవిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అటవీశాఖ కన్జర్వేటర్ విజయ్ కుమార్ లు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రికి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళే భక్తులకు కేవలం ఈ రోజు నుంచి శివరాత్రి పర్వదినం15 వ తేది వరకు మాత్రమే అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీశాఖ అనుమతులను మంజూరు చేయడమైనదని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తులు పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకునీ ఆ శివయ్య ఆశీస్సులను అందుకోవాలని ఆశిస్తున్నామన్నారు.
ఈ పాదయాత్ర సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు:
అటవీ మార్గంగా వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ,ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం చేయటం జరిగింది కాబట్టి ప్లాస్టిక్ సామాన్లు అడవిలో తీసుకెళ్లకూడదు. ఎవరైనా ప్లాస్టిక్ తో తినుబండారాలు తెచ్చిన వాటిని తిరస్కరిస్తున్నారు. తినుబండారాలు సైతం కాగితాలలో పొట్లాలు కట్టుకొని తెచ్చుకోవాలని అధికారులు కాలిబాటన వెళ్లే భక్తులకు సూచించారు.
సిగరెట్ పాన్ గుట్కా తంబాకు, మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధం కావున ఫారెస్ట్ లో కాలిబాటన నడిచే వాళ్ళు వాటిని వదిలివేయాల్సి ఉంటుంది. అక్రమంగా మద్యం బాటిల్లతో సిగరెట్టు గుట్కా ప్యాకెట్లతోను వస్తే పై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానంకు పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది. కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడనుండి కాలినడకన బయలుదేర వలసి ఉంటుందన్నారు.
అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మందులు అనగా ఒళ్ళునొప్పులకు , కీళ్ల నొప్పులకు , తలనొప్పి , కాళ్ళు బెణకటం వంటి సమస్యలకు మీతో పాటుగా అవసరమైనటువంటి మాత్రలు తీసుకు వెళ్ళాలి. శ్రీశైలంకు కాలి బాటన వెళ్లే భక్తులకు దారినడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు. అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు. డిజిటల్ పేమెంట్స్ పనిచేయవు. కావున తగినంత చిల్లర 20 రు 50, 100 రూపాయలు నోట్లు మీతో తీసుకువెళ్ళాలని అధికారులు తెలిపారు. కాలినడక దారిలో మధ్యలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. నడక దారి కాబట్టి దప్పిక ఎక్కువగా ఉంటుంది. కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకెళ్లండి. మధ్యలో నీళ్లు అమ్ముతుంటారు. మీ బాటిల్స్ లో వాటిని నింపుకోవచ్చని అధికారులు తెలిపారు.
వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయి. ఇవి పూర్తిగా ఉచితం. వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తారు అందులో ఉచితంగా మందులు ఇస్తారు. మీరు వేర్వేరు భూభాగాల కొండలు , లోయలు గుండా నడుస్తారు. ఇందుకు మీ శరీరం మీకు పూర్తిగా మద్దతు ఇవ్వాలి. అలా నడవలేని వారు దయచేసి ప్రయత్నించకండి. మరుగుదొడ్లు టాయిలెట్లు నిర్దేశించబడిన ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయన్నారు. విశ్రాంతి కోసం పెద్ద చెరువు దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడ పట్టలు దొరుకుతాయి. వాటిమీద నిద్రించాల్సి ఉంటుంది. మీరు శ్రీశైలం వరకు నడిచి వెళ్ళాటానికి , మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ ప్రయాణంలో మీ వెంట ఆ శివయ్య ఉంటాడని మరచిపోకండి. ఆయన ఆశీస్సులు మనపైన ఎప్పుడూ ఉంటాయి ఆరోగ్యంగా ఉన్నవారు తప్పక నిబంధనలు సూచనలు పాటించాల్సి ఉంటుందని అటవీశాఖ అధికారి పేర్కొన్నారు.
కాలి నడకన వెళ్లేవారు ఈ మ్యాప్ కనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కరు ఇద్దరు కాకుండా నడక మార్గంలో గుంపులు గుంపులుగా వెళ్లాల్సిన అవసరం ఉంటుందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఓవర్ లోడ్ వాహనాలపై చర్యలు.. ఆత్మకూరు టు శ్రీశైలం అనుమతి లేదు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆత్మకూరు నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లే ప్రతి వాహనం పరిమితికి మించి వెళ్ళరాదని అటవీశాఖ రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.
గుంటూరు విజయవాడ ప్రాంతాలకు ఈ సమయంలో తీసుకెళ్లే వివిధ రకాల ఉల్లి మిరప తదితర పంటల ధాన్యాల ను లోడ్లను తీసుకొని వెళ్లి వాహనాల్లో దోర్నాల వరకు ఘాట్ రోడ్డు కావున ఏదైనా ప్రమాదం జరిగితే ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా ఉంటుంది కాబట్టి పరిమితిలోడుతోనే వెళ్లాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుందని సూచిస్తున్నారు. అధిక లోడుతో వచ్చే వాహనాలను ఆత్మకూరు దగ్గరే నిలిపేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టడం విశేషం. గుంటూరు విజయవాడ వెళ్లే భారీ వాహనాలను అత్యవసరము అనుకుంటే నంద్యాల గిద్దలూరు మీదుగా గుంటూరు విజయవాడ వెళ్లాలని పోలీస్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
