SHEELA | ఆదరించి గెలిపించండి..
- గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…
- గుడిహత్నూర్‌లో ఇంటింటా ఆడే శీల ప్రచారం
SHEELA | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : ప్రజలు ఆదరించి గెలిపిస్తే గుడిహత్నూరు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తానని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఆడే శీల అన్నారు. గతంలో సర్పంచ్‌గా చేసిన అనుభవం, ప్రజల్లో తనకున్న మంచితనం గెలుపునకు బాటలు వేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఇంటింటికీ వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామపంచాయతీ పరిధిలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కోతుల బెడద తొలగించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, ఆడే షీలా అభిమానులు పాల్గొన్నారు.


