Shed construction | హామీ ఇచ్చారు.. మాట నిలబెట్టారు
Shed construction | జైనూర్, ఆంధ్రప్రభ : ప్రకృతీ సహజసిద్ధంగా కొండ కోనల్లో కొలువుదీరిన ఆరాధ్య దేవతల సన్నిధిలో భక్తులు సేద తీరడానికి షెడ్ల నిర్మాణం(Shed construction) చేపడతామని ఇచ్చిన హామీని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిలబెట్టారు. ఇవాళ కొమరం భీం ఆ సిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూసిమెట్ట గ్రామ సమీపంలోని సుంగపూర్ అవ్వల్ పెన్ (పోచమ్మ తల్లి) , రావుజీ గూడ లో జై జంగో జై లింగు దేవస్థానం వద్ద మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(Atram Sakku) ఆదేశాల మేరకు జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, స్థానిక సర్పంచులు దుర్వ సింధు నగేష్, ఉయిక చందు, జాదవ్ భావు రావుతో కలిసి ఈ రోజు షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ ఆదివాసీల పురాతన ఆలయాలు, ఇలవేల్పు పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా షెడ్లు నిర్మించడం జరుగుతుందని చెప్పారు. హామీ ఇచ్చిన అనతి కాలంలోనే షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో ఆయా గ్రామాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండాడి లింగు, నాయకులు మెస్రం అంబాజీ రావు, కనక గంగారం, పెందుర్ ప్రకాష్,గ్రామ పటేల్ ఆత్రం భాపురావు, కుమర కట్టి, జై జంగో లింగు భక్తులు ఊర్వేత మోహన్, రోహిదాస్, తనాజీ, నగేష్, మెస్రం దత్తు తదితరులు పాల్గొన్నారు.

