బాసర , ఆంధ్రప్రభ : నిర్మల్(Nirmal) జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి(Goddess Sri Gyan Saraswati) అమ్మవారి సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు(Devi Navratri Festival) ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపంలో అమ్మవారు మొదటిరోజు శైల పుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము వచ్చినది. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము(Trident), ఎడమచేతిలో కమలము తో విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును.

ఈ అమ్మవారిని భక్తి తో అర్చిస్తే మనోవాంఛలు నెరవేర్చును. ఆలయ వేద పండితులు అర్చకులు మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్ఛారణలతో శైల పుత్రి అమ్మవారి(mother’s)కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగ కట్టె పొంగలి సమర్పించారు.