weather Effect | తీవ్ర వాయుగుండం ప్రభావం..

weather Effect | తీవ్ర వాయుగుండం ప్రభావం..
శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Severe weather effect | ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం ప్రభావం (Severe weather effect) తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో (Nellore, Chittoor and Tirupati districts) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.
తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి దూరంగా వెళ్లకుండా ఉండాలని సూచించింది.
