Services | ఉచిత వైద్య శిబిరం..

Services | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Rajendra Prasad), ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు(Chalasani Anjaneyulu) బుధవారం ఉదయం ప్రారంభించారు. అయితే.. తొలుత వాక్ ధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ వారిచే వైద్య శిబిరంలో రోగులకు (For patients) వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి, బాబు, శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, పిఏసీఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, గొర్రెపాటి సురేష్, శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కుంపటి చిట్టిబాబు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
