Service Society | పర్యటన వద్దు… ఇండ్లు కావాలి….
Service Society | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిమ గిరిజనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఇండ్ల కార్యక్రమాన్ని చేపట్టే విధంగా జిల్లా ఇంచార్జి మంత్రి కృషి చేయకుండా అడవి బిడ్డలను హైదరాబాద్ విహారయాత్రకు తీసుకువెళ్తామని ప్రకటించడం హస్యాస్పదమని పీవీ టీజీ జెఎసి జిల్లా అధ్యక్షుడు టెకం వసంతరావు, కోలాం సేవా సంఘం(Service Society) ఉట్నూరు మండల ప్రధాన కార్యదర్శి సి డాం బాపురావు లు అన్నారు.
ఈ రోజు అదిలాబాద్ జిల్లా(Adilabad District) ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్న గిరిజన నాయకులు తల పెట్టిన ధర్నాను అనివార్య కారణాల వల్ల విరమించుకున్నా మన్నారు. ఈ సందర్బంగా నిరసన తెలిపారు.ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కుమ్మరి కుంట కొలాం గిరిజన గ్రామాన్ని సందర్శించడంతో తమ ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు వస్తాయని భావించామని కానీ మంత్రి కొలాం(Kolam) గిరిజనులను హైదరాబాద్ సందర్శనకు తీసుకువెళ్తామని చెప్పి వెళ్లారన్నారు.
అడవి బిడ్డలకు కనీసం ఉండడానికి ఇల్లు కావలసి ఉండగా తమ ఇబ్బందులు పట్టించుకోకుండా కేవలం తీయటి మాటలు చెప్పి వెళ్లిపోయారన్నారు. మంత్రి చెప్పిన హైదరాబాద్ పర్యటన కార్యక్రమాన్ని స్వాగతించడం లేదనిఇదిఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) మంజూరు చేసిన పీఎం జన్మన్ గృహాలు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి న ఇందిరమ్మ ఇండ్లు నిర్మించకుండా అటవీ శాఖ అధికారులు ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేశారని అన్నారు.
గిరిజన ప్రాంతాలలో ఐదవ షెడ్యూలు ప్రకారం రాజ్యాంగం కల్పించిన ఆదివాసుల హక్కులను ప్రభుత్వం రక్షించాలన్నారు. 2012లో ప్రకటించిన టైగర్ జోన్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్(MLA Bojju Patel) ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అనుమతి ఇప్పించాలని కోరారు. లేనట్లయితే ఉద్యమ కార్యాచరణ చేపట్టి నిరంతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మడా వి మాణిక్ రావు, మాజీ ఎంపీటీసీ కొడప అనసూయ, కొ డప భీమ్రావు, నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

