భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
వాహన తనిఖీల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోర్టుకు హాజరుపరిచారు. దమ్మపేట కోర్టు జడ్జి భవాని విచారణ అనంతరం వారికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా దమ్మపేట పోలీసులు హెచ్చరిస్తూ మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

