ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం
- గుర్తుతెలియని వాహనం ఢీ
- ఇద్దరు యువకులు మృతి
శంషాబాద్, ఆంధ్రప్రభ : కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు యువకులు గురువారం పెద్ద షాపూర్ మదనపల్లి మార్గమధ్యలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మదనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టి, వారిపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరజ్, బిక్కి అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో సూరజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా, బిక్కి పీ అండ్ జీ లోని చిన్ను ఇంజినీరింగ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
