చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

  • ఐదుగురు మృతి

చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట రూరల్ పరిధిలోని బైపాస్ రోడ్డుపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు⁠… (వారిలో కొంతమంది అయ్యప్ప మాలలో ఉన్నారు) వినుకొండలో ఇరుముడి తీసేందుకు గుంటూరు నుంచి ఒంగోలు వైపుకు కారులో ప్రయాణిస్తుండగా, చిలకలూరిపేట కొత్త బైపాస్ ఫ్లైఓవర్ సమీపంలో చెన్నై వైపు ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను కారు వేగంగా ఢీకొట్టి, కంటైనర్ కిందకు వెళ్లిపోయింది.

ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు మరో ఇద్దరిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో యువకుడు మరణించాడు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు మృతి చెందగా, మరో యువకుడికి స్పృహవచ్చే స్థితిలోలేడని పోలీసులు తెలిపారు. ప్రమాద ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Leave a Reply