Septic tank | సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి
Septic tank | సిరిసిల్ల , ఆంధ్రప్రభ : సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఓ బాలుడి మృతి చెందిన సంఘటన సిరిసిల్ల సర్ద్‌పూర్‌నగర్‌లో చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నికేష్ అనే ఆరేళ్ల బాలుడు ఆడుతూ నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్(Septic tank)లో పడి మృతి చెందాడు. సాయంత్రం ఆటకు వెళ్లిన బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు.
రాత్రి పది గంటలకు నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో బాలుడి అపస్మారక స్థితి(unconsciousness)లో కనిపించాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యుఉ తెలిపారు.

