తిరందాసు గోపి వర్ధంతి వేడుకలు

తిరందాసు గోపి వర్ధంతి వేడుకలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నాయకులు తిరందాసు గోపి 9వ వర్ధంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఘనంగా నిర్వహించారు. గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తిరందాసు గోపి కార్మికుల, కర్షకుల హక్కుల సాధనకై పోరాడిన నాయకుడన్నారు.

గోపి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, నాయకులు బత్తుల దాసు, బండారు నరసింహ, బత్తుల శ్రీశైలం, బొడ్డు అంజిరెడ్డి, ఆకుల ధర్మయ్య, ఉస్కాగుల రమేష్, చికూరు ఈదయ్య, కందగట్ల ఆనంద్, బోయ యాదయ్య, బత్తుల లక్ష్మయ్య, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply