Selfie|ఎన్నికల అధికారులతో కలెక్టర్ సెల్ఫీ…

Selfie|ఎన్నికల అధికారులతో కలెక్టర్ సెల్ఫీ…
Selfie| ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రం మెయిన్ గేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ డెస్క్ వద్ద మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పనిచేసి స్థానికంగా ఓటేసిన అధికారులతో బుధవారం కలెక్టర్ హనుమంతరావు సెల్ఫీ దిగారు. ఓటు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎంతో సమన్వయంతో పని చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆర్వో వలిగొండ ఆంజనేయులు, ఏ ఆర్ ఓ దూడల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
