విద్యార్థులే … ఉపాధ్యాయులైన వేళ

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈవోగా, ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో కనిపించి పాఠశాలలో ఉత్తేజ వాతావరణాన్ని కలిగించారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులు బోధనలో చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.
నేటి ప్రధాన ఉపాధ్యాయులుగా మొగులగాని మానస, కలెక్టర్ గా చల్ల పల్లవి, డిఈవోగా కొమ్మ మనీషా, డిప్యూటి డీఈవోగా పర్వతగిరి గ్రీష్మ, ఎమ్మెల్యేగా కురుమేటి శివ సాయిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిర్యాల దామోదర్, ఉపాధ్యాయ బృందం ముక్కామల లింగమల్లు, బండారు మల్లయ్య, వంగూరి యాదయ్య, దర్శనం వెంకన్న, చిరుమర్తి యాదయ్య, కే కవిత, డి తిరుపతి, కే కృష్ణవేణిలు అభినందించారు.
