స్వాధీనం చేసుకున్న పోలీసులు
రాయపూర్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పామెడ్(Pamed) ప్రాంతంలోని కొరగుట్ట అడవుల్లో కోబ్రా 308 బెటాలియన్(battalion) ఈ రోజు కూంబింగ్ నిర్వహించింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు భూగర్భంలో పెద్ద మొత్తంలో దాచిపెట్టిన పేలుడు పదార్థాలు, వారు ఉపయోగించే వస్తువులను స్వాధీనం భద్రతా దళాలు(security forces) చేసుకున్నాయి.
కుచల్(Kuchal) గ్రామంలోని అడవుల్లో ఒక గొయ్యి తవ్వి మావోయిస్టులు ఈ సామగ్రిని దాచిపెట్టారు. గన్ పౌడర్(gunpowder), బీజీఎల్ సెల్స్, కార్టెక్స్ వైర్, బీజీఎల్ రౌండు ఆఎక్స్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, బాంబులు (బుపూవైజ్డ్), బారెల్స్(barrels) ఉపయోగించే ఇనుప రాడ్లు, ఇంప్రూవైజ్డ్ క్రిస్టల్ షుగర్, రైనట్లు జనవ పటకార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.