- జీవో విడుదల చేసిన ప్రభుత్వం…
- హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి రిలీవ్ చేస్తూ….
- డిప్యూటీ కలెక్టర్ గా మాతృ సంస్థ రెవెన్యూలోకి…
- శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా పోస్టింగ్…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద దేవస్థానంగా ఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వీకే శీనా నాయక్ ను నియమించారు. ఇప్పటికే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆయనను మాతృ శాఖ రెవెన్యూకు బదిలిచేసి అక్కడ నుండి దుర్గగుడి ఈవోగా బాధ్యతలను అప్పగిస్తూ సీఎస్ మంగళవారం జీవో ను విడుదల చేశారు.
జనవరి 1వ తేదీ నుండి ఇప్పటివరకు దుర్గ గుడికి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలను దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్ నిర్వహిస్తున్నారు. తాజా ప్రభుత్వ ఆదేశాలతో తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.