పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..

గూడూరు, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షలు రాష్ట్రమంతటా సోమవారం నుండి మొదలయ్యాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరులో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎంతో పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అప్పటికే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కేంద్రాల లోపలకి హాల్ టికెట్లు పరిశీలించి పరీక్ష రాసే విద్యార్థుల్ని అనుమతించారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచుతూ జిరాక్స్ షాపులు తదితర దుకాణాలు సైతం మూయించి వేశారు.

గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాల, రెండో పట్టణంలో రెండు కళాశాలలు, రూరల్ పరిధిలో ఒక కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరైనా ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డిఎస్పి గీతాకుమారి హెచ్చరించారు. విద్యార్థులు పరీక్ష సమయాలకి అర గంట ముందే చేరుకోవాలని ఎండ తీవ్రత అధికంగా మొదలవుతున్న దృశ్య తాగునీరు అధికంగా తీసుకోవడంతో పాటు పరీక్షలు అనే ఒత్తిడిని కూడా తగ్గించుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply