ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ కాంబోలో సుజీత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘OG’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘సువ్వీ సువ్వీ సువ్వాలా.. సూదంటూ రాయే పిల్లా..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫైర్ స్టార్మ్ సాంగ్ అదరగొడుతోంది. కాగా ఈ చిత్రం వచ్చే నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.
రెండు పాటలు కూడా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ‘OG’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడింది. ఇది వచ్చే నెల 25వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.