రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం

రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం
క్రీడాకారులను అభినందించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో ని గచ్చిబౌలిలో జరుగుతున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్‌లో నారాయణపేట జిల్లాకు చెందిన మహిళా వాలీబాల్ జట్టు విద్యార్థులు ప్రతిభను చాటి రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి సాధించారు. సోమవారం తమ ప్రతిభను కనబరిచి మూడో బహుమతి సాధించినట్లు డి వై ఎస్ వో శెట్టివెంకటేష్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ గౌడ్ గెలుపొందున జట్టు విద్యార్థులను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేట విద్యార్థులు వాలీబాల్, లో మూడోస్థానం సాధించి జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచారని అన్నారు. విజేతలను రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జట్టును అభినందించినట్లుపేర్కొన్నారు. మహిళా క్రీడాకారిణులు రాష్ట్రానికి గర్వ కారణం ప్రతిభకు ప్రభుత్వ పూర్తి ప్రోత్సాహం అందిస్తాం అని పేర్కొన్నారు.
జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోచ్ సాదిక్ కృషిని కూడా నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ రాష్ట్రస్థాయి విజయం భవిష్యత్‌లో నారాయణపేట జిల్లాకు మరిన్ని క్రీడా విజయాలకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పిడిలు పి ఈ టి లకు జట్టు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
