SCTPC | పోలీస్ శిక్షణ ఏర్పాట్ల పరిశీలన
- ఎస్పీ జగదీష్
SCTPC | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. ఈ రోజు ఉదయం ఇటీవల ఎంపికై అనంతపురం(Anantapur) జిల్లాకు కేటాయించబడిన 98 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (SCTPC) ఈ నెల 22వ తేదీ నుండి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణా కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా సమగ్రంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. శిక్షణార్థుల(trainees) కోసం బ్యారక్‌లు, క్లాస్‌రూములు, పరేడ్ గ్రౌండ్, శారీరక శిక్షణ స్థలాలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత తదితర ప్రధాన విభాగాలను పర్యవేక్షించారు.

మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిక్షణార్థులు పొందే వసతి, తాగునీరు, భద్రత, వైద్య సదుపాయాలు వంటి ప్రధాన అంశాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ(Continuous monitoring) చేయాలని సూచించారు. శిక్షణా కార్యక్రమాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కావాల్సిన చర్యలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు మధు, పవన్ కుమార్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఎస్సై శేషగిరి, మహిళా ఏఎస్సై నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

