Science Lab | నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి

Science Lab | నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి

Science Lab | జైనూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యాబోధన అందించాలనే సదాశయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక కృషి చేస్తున్నాయని జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. శనివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రం లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో పీఎం శ్రీ ద్వారా మంజూరైన రూ .21 లక్షల తో నిర్మించే సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ భవనం నిర్మాణం పనులకు స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ తో కలిసి భూమి పూజ చేశారు.

Science Lab | 200 కోట్ల వ్యయంతో

ఈ సందర్భంగా చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కు సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగాప్రతినియోజకవర్గంలో 200 కోట్ల వ్యయంతో ఆదునిక తరగతి గదులు, క్రీడా మైదానాలు, బోధన సిబ్బంది ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్యా బోధనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. పీఎం శ్రీ ద్వారా సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ తరగతులు నిర్వహణకు ప్రత్యేక భవనం నిర్మించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Science Lab |

అనంతరం జాతీయ విజ్ఞాన సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు తమ మేధో శక్తితో ఆవిష్కరించిన సోలార్ లైట్ విద్యుత్ దీపాల పరికరాలు, శుద్ధి జలాల తయారీ విధానంతో పాటు ఇతరత్రా స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుధాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతీ, ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, ఏఈ శశిధర్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, ఏపీఓ నగేష్, నాయకులు షేక్ అబ్దుల్ ముఖీద్, మెస్రం అంబాజీ, గేడం గోపీచంద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply