కోనాపూర్ పాఠశాలలో సైన్స్ మేళా..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సైన్స్ మేళా ఏర్పాటు చేశారు.అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్,కుప్పం వారిచే పాఠశాలకు అందజేయబడిన సైన్స్ కిట్ పరికరాలతో తయారు చేసిన సైన్స్ ఉపకరణాలను విద్యార్థులు ప్రదర్శించారు.6 నుంచి 10 తరగతుల జీవశాస్త్రము,భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము సబ్జెక్టుల్లో 100 ప్రయోగాలను విద్యార్థులు తయారు చేశారు.మానవ ఆస్తిపంజరం నమూనా,పుర్రె నమునా,లేజర్ లైట్, ఆహారపు గొలుసు,వివిధ రకాల జంతువుల చిత్రాలు,బ్యాటరీ,కాంతి అనువర్తనాలు మొదలైనవి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, సైన్స్ ఉపాధ్యాయులు రామకృష్ణ,భాస్కర్,రాజా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

