చైతన్య హైటెక్ స్కూల్లో సైన్స్ ఫెయిర్

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని చైతన్య హైటెక్ స్కూల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ లో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు సైన్స్ ప్రాజెక్ట్ లతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, విద్యావేత్త సిరికొండ శ్రీనివాసచారి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ప్రిన్సిపాల్ వీణవంక రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బిక్షపతి, బాబా అన్సారి, వైష్ణవి, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలగువారు విద్యార్థులను ప్రోత్సహించి వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీనివాస చారి పిల్లలను మరియు ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.

Leave a Reply