School | స్వచ్ఛత యజ్ఞం..
School | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని 40వ డివిజన్‌లో పరిశుభ్రత, పచ్చదనం పెంపు లక్ష్యంగా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పిలుపు మేరకు ఈ రోజు కరీమాబాద్(Karimabad)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘స్వచ్ఛత పాఠశాల’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. డివిజన్ పరిసరాలలో ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రత కోసం శ్రమదానం చేయాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు.
ఆయనే స్వయంగా ముందుండి కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన స్వచ్ఛత కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసి, పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, “ప్రభుత్వ సంస్థలలో, పాఠశాల(School)ల్లో పరిశుభ్రతను పాటించడం కేవలం సిబ్బంది బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. ఈ శ్రమదానం ద్వారా పాఠశాల పరిసరాలు శుభ్రంగా, హరితంగా మారాయి.
ఇలాంటి సామూహిక ప్రయత్నాలు ప్రజల్లో సాఫల్య భావనను, సామాజిక బాధ్యతను పెంచుతాయి అన్నారు. భవిష్యత్తులో కూడా డివిజన్ పరిధి(Divisional Area)లో ఇలాంటి స్వచ్ఛత కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల ఆఫ్ చైర్మన్ పద్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మాధవి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు(Primary School Principals) జయప్రకాష్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాఠశాల బోధనేతర సిబ్బంది, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.

