School | ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

School | ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

School | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఆడపిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నర్సింహులపేట తహసిల్దార్ రమేష్ బాబు అన్నారు. ఈ రోజు మండలంలోని పడమటిగూడెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయుడు ఎర్ర పూర్ణ చందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పాతూరి వెంకట్ రెడ్డి సోదరి సుగుణ దేవి స్మారకర్ధం వారి కుమారుడు డాక్టర్ రాంప్రతాప్ రెడ్డి రూ.25 వేల ఆర్థిక సహాయంతో విద్యార్థులందరికీ ఉచితంగా టీషర్ట్లుపంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం వస్తేనే ఆడపిల్లల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. పురుషులతో సమానంగా విస్తృత అవకాశాలు మహిళలకు ఉన్నాయని, ఆడపిల్లల చదువుతోనే ఆ ఇల్లు, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠశాల అభివృద్ధి అనేది గ్రామాభివృద్ధికి మైలురాయి వంటిదని టీ షర్ట్లు బహుకరించిన దాతలు డాక్టర్ రాంప్రతాప్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉషా, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు రమేష్ రెడ్డి, వెంకన్న, శ్రీశైలం, లింగన్నసునీల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply