school | మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం…

school | మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం…

school | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ హెచ్చరించారు. ఈ రోజు నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల, ఉర్దూ మీడియం పాఠశాల(schools)ల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించారు.

బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం(meal) పెట్టడం లేదని గుడ్లు సక్రమంగా ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ఎంపీడీవో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని వంట ఏజెన్సీ(agency) నిర్వాహకులను హెచ్చరించారు. ఆయా పాఠశాలల్లో వివిధ తరగతులు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.

విద్యార్థులను చదువుతో పాటు వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply