school | మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి…

school | మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి…

school | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కొల్లూర్ సర్పంచ్ సువర్ణ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కవిత సురేందర్ రెడ్డిఅన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూర్ ప్రభుత్వ పాఠశాల(Government school)ను పరిశీలించారు. పాఠశాలలో వివిధ సమస్యలు హెచ్ఎం ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులను చదువుతోపాటు నేటి పోటీ ప్రపంచంలో వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించాలన్నారు.

మధ్యాహ్న భోజనం నిర్వహికులు బియ్యం సరుకులు శుభ్రంగా కడిగి వంటలుచేయాలన్నారు. అనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్లను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించిఅభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయ బృందం కరుణాప్రసాద్, శారద వార్డు సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply