SCHOOL | విద్యార్థులను తీర్చిదిద్దాలి

SCHOOL | విద్యార్థులను తీర్చిదిద్దాలి

SCHOOL | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులను చదువు, క్రీడారంగంతో పాటు వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలని ఎడవెల్లి సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ సాబమ్మ వెంకటప్ప అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవెల్లి ఎంపీపీ ఎస్ పాఠశాలను పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

విద్యుత్ తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని చదువులో తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకోగా, మరుగుదొడ్ల మరమ్మతులు, పాఠశాల భవన భద్రత, ప్రాంగణాభివృద్ధి చేపట్టాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా గెలుపొంది పాఠశాలకు వచ్చిన సర్పంచ్, ఉప సర్పంచ్ ల‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కల్పనా, ఉపాధ్యాయ బృందం అనిత, రవళిక, నరేష్ గౌడ్ వెంకట రాములు, స్వరూప్, రాజ్, సోహెల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply