School | సి.వి. రామన్ స్ఫూర్తితో శాస్త్ర ప్రదర్శనలు

School | సి.వి. రామన్ స్ఫూర్తితో శాస్త్ర ప్రదర్శనలు
విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు.
శాస్త్ర విజ్ఞానమే దేశాభివృద్ధికి పునాది.
భాస్కర్ నగర్ శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు
School | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : స్థానిక భాస్కర్ నగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యతను చాటి చెప్పే ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏజీఎం సురేష్, ఆర్‌ఐ సీతారామి రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న లక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏజీఎం సురేష్ మాట్లాడుతూ భారత ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ 1928 ఫిబ్రవరి 28న ‘రామన్ ప్రభావం’ను కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వివరించారు. శాస్త్ర విజ్ఞానం దేశ ప్రగతికి మూలస్తంభమని, ప్రతి విద్యార్థి సి.వి. రామన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని పరిశోధనాత్మక దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సైన్స్ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు రూపొందించిన కొత్త ఆవిష్కరణలు, శాస్త్ర నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, రసాయన శాస్త్రం తదితర విభాగాలకు సంబంధించిన నమూనాలను సమగ్ర వివరణలతో విద్యార్థులు ప్రదర్శించడం విశేషం. చిన్న వయస్సులోనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటే భవిష్యత్‌లో సాంకేతిక రంగంలో విశేష పురోగతి సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ డీన్ సుబ్బయ్య, ప్రాథమిక మరియు ప్రీ-ప్రాథమిక విభాగాల ఇన్‌చార్జీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమం మొత్తం శాస్త్రస్ఫూర్తిని నింపుతూ విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించిన వేదికగా నిలిచింది.
