భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ…

భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ…

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో ఆదివారం సూర్యోపాసన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. లోక కల్యాణార్థం, భక్తుల క్షేమం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులందరూ పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ వేద పండితులు అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత లభిస్తాయని పండితులు తెలిపారు. ముఖ్యంగా ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఈ సేవకు విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యోపాసన అనంతరం కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply