scheme | కృష్ణారావు మేలు మరువలేనిది

scheme | కృష్ణారావు మేలు మరువలేనిది
scheme | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : కృష్ణానది అంచున ఉన్న తమ ఈలచెట్లదిబ్బ దీవికి మండలి వెంకట కృష్ణారావు చేసిన మేలు మరువలేనిది అని గ్రామ ప్రముఖులు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ, దివిసీమ పునర్నిర్మాత, తెలుగు భాష అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ రోజు అవనిగడ్డ వంతెన సెంటర్లోని కృష్ణారావు విగ్రహానికి ఈలచెట్లదిబ్బ గ్రామం నుంచి అవనిగడ్డ వెంకటేశ్వరరావు, రేవు సువర్ణరాజు, దాసరి శేఖర్ బాబు, చింతా బసవయ్య, సైకం వెంకటకృష్ణ, చెన్ను శ్రీనివాసరావు, అండ్రాజు రవి, లంకె కుమారస్వామి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ… 1971లోనే తమ దీవికి పంపింగ్ స్కీమ్ ఏర్పాటు చేసి రెండు వేల ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు మండలి వెంకట కృష్ణారావు కృషి చేశారని తెలిపారు.

అప్పటి ఉమ్మడి రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి వీ.పురుషోత్తమ రెడ్డిని ఎంవీ కృష్ణారావు తమ దీవికి రప్పించి పంపింగ్ స్కీమ్ ఆవశ్యకత వివరించారని తెలిపారు. ఈ దీవిలో రైతులు పంపు సెట్లతో ఇరవై బస్తాలు పండించారని, ఇక్కడి నేల సారవంతమైనది కాబట్టి పంపింగ్ స్కీమ్ ఏర్పాటు చేస్తే, ఇక్కడి ఉత్సాహవంతులైన రైతులు వరి దిగుబడి మరింతగా పెంచుతారని వివరించి తమ గ్రామం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన ఘనత కృష్ణారావుకే దక్కిందన్నారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాధ్ ప్రసాద్, నీటి సంఘాల అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, చుండూరు నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, యర్రంశెట్టి సుబ్బారావు, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానేపల్లి కోటయ్య, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు బండే రాఘవ, కూరాకుల శివప్రసాద్, బచ్చు శ్రీహరి, డేగల రాఘవ, పులిగడ్డ బాలు శ్రీనివాస్, ఆకుల సీతామహాలక్ష్మి, డైరెక్టర్ అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, బాలమ్మ, అడపా వెంకటేశ్వరరావు, మండలి రామ్మోహనరావు, లుక్కా వెంకట పిచ్చియ్య, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, లుక్కా శ్రీనివాసరావు, భోగాది బాలకృష్ణ, బడే సుబ్బారావు, గుగ్గిలం శ్యాంకుమార్, షేక్ మొగల్ మురాద్ బేగ్, బాబావలీ, బషీర్, సోమిరెడ్డి, సీహెచ్.హరినాథబాబు, బడే సుబ్బారావు, యాసం శ్రీరాములు, మైలా హరిబాబు, కొండవీటి పాండురంగారావు, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, గుడివాక రాము, వాహేదుల్లా తదితరులు పాల్గొన్నారు.
