అమరావతి: ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మంద కృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ,. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మంద కృష్ణ అని, ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మంద కృష్ణ, సీఎం చంద్రబాబు కారణమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. గుర్తింపు లేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిగాయని గుర్తు చేశారు.
సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారన్నారు.. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉందని , దాని ఆధారంగా ఎస్సీలకు మరింత మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని డిప్యూటీ సిఎం వ్యక్తం చేశారు.