Savitha | డూండి రాకేష్ నివాసంలో మంత్రి ఆత్మీయ విందు..

Savitha | డూండి రాకేష్ నివాసంలో మంత్రి ఆత్మీయ విందు..

  • ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆహ్వానంతో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

Savitha | ఆంధ్రప్రభ భవానిపురం : ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆహ్వానం మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మంత్రి పాల్గొని నాయకులు, కార్యకర్తలతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సీల్ అరుణ్ కుమార్, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Savitha

టీడీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, బీసీ సెల్, వాణిజ్య విభాగం, తెలుగు యువత, ఐటీడీపీ నాయకులు శివాజీ ముదిరాజ్, ఇందుకూరి యువరాజ్, మాధవ, చైతన్యతో పాటు 41, 40, 45 డివిజన్ అధ్యక్షులు సంతోష్ కుమార్, చిన్న సుబ్బయ్య, పేరం సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే ఆర్యవైశ్య నాయకులు నూకల నాగేశ్వరావు, వీవీకే నరసింహారావు, పావనకుమార్, సతీష్ ప్రసాద్, అశోక్, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ విందుకు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Savitha

Leave a Reply