గ్రామాల అభివృద్ధికే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక

గ్రామాల అభివృద్ధికే ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక
- జీపీ పారిశుద్ధ కార్మికులను
- ఘనంగా సన్మానించిన సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామాలలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్ట లేనివని సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య అన్నారు, ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్మికు లను సర్పంచ్ ఆవల సునీత యాదయ్య శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సునీత మాట్లాడుతూ గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య అన్నారు.
ఆదివారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పరిధిలోని సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా పరిష్కరిస్తానన్నారు.
గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను తెలుసుకుని వాటిని ప్రణాళికబద్ధంగా గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను గుర్తించి పరిష్కరించడంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా ముందుకు వచ్చి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వ నిధులు మంజూరు చేసుకుందామని పిలుపునిచ్చారు.
