మహిళా సంఘాలకు స్వంత భవనం కల సాకారం…

మహిళా సంఘాలకు స్వంత భవనం కల సాకారం…

  • వీవో భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ జోగు సంపత్ కుమార్
  • దాతల తోడ్పాటుతో గ్రామాభివృద్ధికి బాటలు
  • మహిళా సంఘాల కోసం శాశ్వత వసతి కల్పనకు కృషి
  • సర్పంచ్ ఆధ్వర్యంలో స్థలం అందించిన దాతలకు ఘన సన్మానం

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామంలో సర్పంచ్ జోగు సంప త్ కుమార్ సేవా భావంతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడిగా నిలుస్తున్నారు. గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా వీవో భవనం లేక మహిళా సంఘ సభ్యులు అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి సమస్యను సర్పంచ్ సంపత్ కుమార్ గుర్తించి మహిళా సంఘాల ఇబ్బందులను తన బాధగా తీసుకున్నారు.

మహిళల ఆత్మ గౌరవం, సంఘాల అభివృద్ధి కోసం శాశ్వత పరిష్కారం అవసరమని భావించి భవన నిర్మాణానికి ముందడుగు వేశారు. సమస్యను కేవలం గుర్తించ డం మాత్రమే కాకుండా దానికి పరిష్కారం చూపడంలో ఆయన చురుకు దనం స్పష్టంగా కనిపించింది. భవనం నిర్మాణానికి స్థలం సమకూర్చేలా దాతలను ప్రోత్సహించి గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు.

మీదికొండలో స్థల దాతలకు ఘనంగా సన్మానం:

మీదికొండ గ్రామంలో గురువారం సర్పంచ్ జోగు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. భవన నిర్మాణానికి స్థలం దానం చేసిన దాతల కోసం ఘనంగా సన్మాన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గార్ల పాటి రత్నమ్మ, కీ.శే. శేషా రెడ్డి, గార్లపాటి సుదర్శన్ రెడ్డి, గార్లపాటి రణధీర్ రెడ్డి, గార్లపాటి ఉషా, గార్లపాటి జయపాల్ రెడ్డి, గార్లపాటి సురేందర్ రెడ్డి దాతలను గ్రామ ఉప సర్పంచ్ శ్రీనుతో కలిసి సర్పంచ్ జోగు సంపత్ కుమార్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరించిన స్థల దాతల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి సహకారం వల్ల గ్రామానికి ఒక శాశ్వత సదుపా యం అందుబాటులోకి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యు లు పొన్నం పారిజాతం, జోగు రాజేష్, పవన్, చిలువేరు పెద్ద సమ్మ య్య, వీవోలు పొన్నం రమ, చిలువేరు రజిత, జోగు లావణ్య, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను
మీదికొండ సర్పంచ్ జోగు సంపత్ కుమార్

మహిళా సంఘాల కోసం శాశ్వత వీవో భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఎన్నో సంవత్సరాలుగా భవనం లేక ఇబ్బందులు పడుతున్న మహిళా సంఘాలకు ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. గ్రామాభి వృద్ధి కోసం దాతల సహకారంతో ముందుకు సాగుతున్నాం. స్థలం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామానికి అవసరమైన సౌకర్యాల కల్పన నా ప్రధా న లక్ష్యం. ప్రజల భాగస్వామ్యంతో మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు కట్టుబడి ఉన్నాను.

Leave a Reply