ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని యరుగండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నేరుగా కూలీలను కలిసి పనుల ప్రాముఖ్యతను వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పనకై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని వివరించారు. పని ప్రదేశాలలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి తెలుసుకున్నారు. వీరి వెంట పంచాయతీ సెక్రటరీ శ్రవణ్, ఫీల్డ్ అసిస్టెంట్ వల్లంల శ్రీశైలం, ముత్తు ఉన్నారు.
