హామీ నెరవేర్చిన సర్పంచ్…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఎవరైనా మృతి చెందుతే అంత్యక్రియలకు రూ. 3 వేలు ఆర్థిక సహాయం చెల్లిస్తానని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి సర్పంచ్ ఆర్.నర్సిములు బుధవారం హామీ నెరవేర్చారు. కొత్తపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో గ్రామంలో ఎవరు మృతి చెందిన అంత్యక్రియలకు రూ3000 వేలు చెల్లిస్తానని పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామానికి చెందిన చాపాలి నర్సములు మృతి చెందడంతో మృతి కుటుంబ సభ్యులకు నగదు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎన్నికల హామీ నెరవేర్చి అంత్యక్రియలకుఆర్థిక సహాయం చేసి మాట నిలుపుకున్న సర్పంచ్, ను పలువురు అభినందిస్తున్నారు.

Leave a Reply