మున్సిపల్ చైర్మన్ ను కలిసిన సర్పంచ్, బీజేపీ నాయకులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల గెలుపొందిన కొండ శ్వేతాసత్య యాదవ్ దంపతులను నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య బిజెపి నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగాకలిసి సన్మానించిఅభినందించారు. ఈ సందర్భంగా బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకోవడం సంతోషకరమని నారాయణపేట ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. ఎంపీడీకే అరుణ కేంద్ర ప్రభుత్వ నిధులతో పేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు గౌడ్,తులసి దాస్, వెంకటేష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply